English | Telugu

టీజర్ రివ్యూ: భాగమతి

on Dec 20, 2017

అరుంధతి, పంచాక్షరి, వర్ణ, రుద్రమదేవి సినిమాల తర్వాత అనుష్క నటించిన లేడి ఓరియెంటేడ్ మూవీ భాగమతి. ఈ జోనర్ మూవీస్‌లో తనకు తిరుగులేదని జేజేమ్మ నిరూపించడంతో పాటు.. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో భాగమతిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. "ఓ పురాతన కోటలాంటి బంగ్లాలోకి అనుష్క అడుగుపెట్టే షాట్‌తో టీజర్ మొదలై.. కోపంగా తన చేతికి తానే సుత్తితో మేకు కొట్టుకోవడంతో ఎండ్ అవుతుంది. చూస్తుంటే అరుంధతి స్టైల్‌లోనే ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు.

ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే.. చూస్తున్న వారిలో ఎంగ్జయిటిని పెంచే విధంగా టీజర్ ఉంది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజీక్, మది సినిమాటోగ్రఫి ఆకట్టుకునే విధంగా ఉంది. అనుష్క లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా మలయాళ నటులు ఉన్ని ముకుందన్, జయరామ్ కీలకపాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీకి.. పిల్ల జమీందర్ ఫేం అశోక్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న భాగమతి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here