పవన్ ఫ్యాన్స్‌కి ఇక త్రివిక్రమ్ దేవుడే
on Dec 19, 2017
కొంతమంది మాట్లాడుతుంటే ఈయన ఎప్పుడు మైక్ వదులుతాడురా అనిపిస్తుంది.. ఇంకొందరు మాట్లాడుతుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అలాంటి అతికొద్దిమంది వ్యక్తుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకరు. ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ హీరో, హీరోయిన్లతో వేయించే పంచ్‌లు తుటాల్లా పేలుతూ ఉంటాయి. ఇక ఏదైనా సినిమా ఈవెంట్‌కు అటెండ్ అయినప్పుడు ఎంతమంది స్టేజ్ మీద ఉన్నా త్రివిక్రమ స్పిచ్ కోసం వెయిట్ చేస్తారు అభిమానులు. అలాంటిది పవన్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతుంటే వినాలని ప్రతి పవన్ అభిమాని ఎదురుచూస్తాడు. ఎందుకంటే పవన్ - త్రివిక్రమ్ రిలేషన్ అలాంటిది మరి. రీసెంట్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ నటించిన సినిమా అజ్ఞాతవాసి.
ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఎప్పటిలాగే త్రివిక్రమ్ మైక్ అందుకుని ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజా ఇచ్చాడు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు అంటూ ప్రసంగం మొదలెట్టాడు.. అజ్ఞాతవాసిలో పవన్ నట విశ్వరూపం చూస్తారని.. భవిష్యత్‌లో కళ్యాణ్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ చాలా గొప్పవాళ్లని.. వారి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకున్నానని చెబుతూ.. అలనాటి సినీ దిగ్గజాల నుంచి నేటి స్టార్ల వరకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలిపి తన ప్రసంగాన్ని ముగించాడు.