ENGLISH | TELUGU  

తలైవా బర్త్‌డే గిఫ్ట్: కాలా సెకండ్ లుక్

on Dec 12, 2017

సౌతిండియన్ సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఏమైనా సర్‌‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 కోసమైతే చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఈ మూవీ టీజర్ కూడా బయటకి రాలేదు.. ఈ రోజు వస్తుందన్న క్లారిటీ కూడా లేదు. అయితే రోబో 2.0 తో పాటు సూపర్‌స్టార్, పా రంజిత్ దర్శకత్వంలో కబాలికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న "కాలా" అనే సినిమాలో నటిస్తున్నాడు. రజినీ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం "కాలా" సెకండ్ లుక్‌ని రిలీజ్ చేశాడు ఆయన అల్లుడు ధనుష్. ఈ లుక్‌లో "నెరిసిన జుట్టుతో.. ఒండినిండా మసితో.. కళ్లద్దాలు పెట్టుకొని కోపంగా చూస్తోన్న స్టిల్ ఆకట్టుకుంటోంది". వండర్ బార్ ఫిలింస్ బ్యానర్‌పై రజినీ అల్లుడు ధనుష్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.. ఇందులో తలైవాకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నటిస్తున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.