ఈ సారి బ్లాక్‌బస్టర్ పక్కా
on Dec 10, 2017
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటించిన హలో మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమం విశాఖలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా అని అన్నారు. అఖిల్‌లో తన తండ్రి నాగేశ్వరరావు కనపడుతున్నారని అన్నారు. ఈ నెల 22న హలో చిత్రం విడుదల చేస్తున్నామని.. వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం.. ఇది ఫిక్స్ అని నాగ్ అన్నారు. ఇది విన్న అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు.. కథపై ఎంత నమ్మకం ఉంటే నాగ్ అంత బల్ల గుద్ది మరీ హిట్ అంటాడు.. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను చూడాల్సిందేనని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అనంతరం అమల మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని.. అక్కినేని అభిమానులందరికీ తన నమస్కారాలనీ.. వాళ్లందరి లాగానే హలో సినిమా కోసం మీ లాగానే వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు.