‘సైరా’లో ఊహించని అద్భుతం?
on Nov 21, 2017
‘సైరా’లో ఊహించని అద్భుతం జరగబోతోంది. అవును... నిజమే. ఈ సినిమాలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంబినేషన్ సెట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. చిరంజీవి 151 చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే చిరంజీవి తమ్ముళ్లలో ఒకరైన నాగబాబు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో పవర్ స్టార్ కూడా కనిపించనున్నట్లు సమాచారం.
కథ రిత్యా... ఆ స్థాయి స్టేటస్ ఉన్న స్టార్ మాత్రమే చేయాల్సిన పాత్ర ఒకటుంది. ఆ పాత్రను ముందు వెంకటేశ్ తో చేయిద్దామనుకున్నారు. కానీ.... చివరకు అనూహ్యంగా పవర్ స్టార్ ‘ఓకే’ చెప్పేశాడట. ఆ పాత్ర నిడివి 10 నిమిషాలే ఉంటుందట. కానీ... ఆ పది నిమిషాలూ ఆ పాత్రదే ప్రాముఖ్యత అట. చాలా పవర్ ఫుల్ గా ఆ పాత్ర ఉండబోతోందని టాక్. మెగా సోదరులు ముగ్గురూ ఒకే స్క్రీన్ ని షేర్ చేసుకుంటే చూడాలనేది మెగా అభిమానుల చిరకాల స్వప్నం. ఆ కల ‘సైరా’తో తీరిపోబోతోంది. ఈ విషయానికి సంబందించిన అధికారిక ప్రకటన... త్వరలో రానుంది. ఇది మెగా అభిమానులకు నిజంగా శుభవార్తే ఏమంటారు?