ENGLISH | TELUGU  

పవన్ ఏం తప్పు చేశాడు..?

on Nov 15, 2017

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. హిట్టూ, ఫ్లాప్‌లతో ఏమాత్రం సంబంధం లేని స్టార్.. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రజంట్ అన్‌ఫిషీయల్‌గా టాలీవుడ్ నెంబర్‌వన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. నటుడిగానే కాకుండా.. తన సహాయగుణంతో కూడా అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఎన్నో అవార్డులు.. రివార్డులు కోరి వరిస్తానన్నా.. చిరునవ్వుతో వద్దని చెప్పిన గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌ది. అలాంటి వ్యక్తికి ఒక అవార్డు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే నంది అవార్డ్.. 20 ఏళ్ల తన ప్రయాణంలో హీరోగా, దర్శకునిగా, నిర్మాతగా, స్టంట్ మాస్టర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గా, కొరియో గ్రాఫర్‌గా, స్క్రీన్ ప్లే రైటర్‌గా తెలుగు సినిమాకు సేవలందించించిన ఆయనను ఒక్కసారి కూడా నంది అవార్డ్ వరించలేదు.

అప్పటి సంగతి పక్కనబెడితే.. నేటి ఏపీ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడికి ఆయన అత్యంత ఆప్తుడు.. గత ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని అందుకోవడంలో పవన్‌ది కీలకపాత్ర. అవసరం వచ్చినప్పుడల్లా ఆయన సహకారాన్ని తీసుకున్న చంద్రబాబు మరి స్నేహధర్మాన్ని మరచిపోయారా..? అవార్డ్స్ ఫైనల్ లిస్ట్‌పై సంతకం చేసేటప్పుడు ముఖ్యమంత్రికి కనీసం పవన్ పేరు గుర్తుకు రాలేదా అని ఆయన అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా మండిపడుతున్నారు. అయినా తమ హీరోకి అవార్డులు, రివార్డులతో పనిలేదని.. నంది అవార్డు కన్నా మా గుండెల్లో స్థానం గొప్పదని వారు అంటున్నారు.
 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.