సాంగ్ రివ్యూ: పీఎస్పీకే 25
on Nov 7, 2017
త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంభినేషన్ అంటేనే అదో సంథింగ్ స్పెషల్. ఆయన ప్రాణమిత్రుడిగా పవర్‌స్టార్‌ను ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే వారిద్దరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు రికార్డులను తిరగరాశాయి. తాజాగా వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి జతకట్టారు.. వరుస ఫ్లాపుల్లో ఉన్న మిత్రుడికి అదిరిపోయే హిట్ట్ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్న త్రివిక్రమ్ అందుకోసం అన్ని రకాల అస్త్రశస్త్రాలను రెఢీ చేశారు. అన్నట్లు ఈ సినిమా కళ్యాణ్‌కు 25వ చిత్రం. ఇందులో ఆయన సరసన అను ఇమ్మాన్యుల్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఈ రోజు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ తొలి పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది. "బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్" అంటూ సాగే పాట లిరిక్స్ క్యాచీగా ఉంది. రిలీజైన వెంటనే పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్‌కు బర్త్‌డే విషెస్ చేస్తూ సాంగ్‌ను తెగ షేర్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.