‘జై’ నందమూరి సెంటిమెంట్
on Nov 2, 2017
బాబాయి, అబ్బాయ్.. ఎప్పుడూ ఎడముఖం పెడముఖం. కలిసి కనబడరూ.. కలిసి పనిచేయరూ.. కనీసం మాట్లాడుకోరూ... అభిమానుల్ని ఇరకాటంలో పడేస్తుంటారు. కనీసం ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా.. మేమంతా ఒక్కటే అనే స్టేట్మెంట్ వీరినుంచి వస్తుందని ఎదురు చూడని అభిమాని లేడు. కానీ... వారి ఆశలన్నీ అడియాసే.చెప్పుకుంటోంది ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉండాలి కదా. అవును.... బాలయ్య, తారక్. వీరిద్దరూ కలిసి ఉండకుండా... ఎప్పుడూ అభిమానుల్ని ఇక్కట్ల పాలు చేస్తూనే ఉంటారు. పాపం... అభిమానులదరికీ ఇదొక పెద్ద వెలితి. అయితే.. వీరిద్దరి విషయంలో అనుకోకుండా జరగిన ఒక్క పరిణామం మాత్రం అభిమానుల ఆనందానికి కారణం అయ్యింది.
అదేంటంటే... బుధవారం బాలకృష్ణ 102 సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమా పేరు ‘జై సింహా’ గా ఖరారు చేశారు. ఈ టైటిల్ చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారట. అబ్బాయ్ ‘జై లవకుశ’ అని పెట్టి బంపర్ హిట్ కొ్ట్టాడు. సంక్రాంతికి ‘జై సింహా’తో బాలయ్య హిట్ కొట్టబోతున్నాడు. ‘జై’ అనేది నందమూరి సెంటిమెంట్ గా మారింది. ఇదే వారి ఆనందానికి కారణం. గతంలో మహానటుడు ఎన్టీయార్ కి కూడా ఈ ’జై’ సౌండ్ బాగా కలిసొచ్చింది. ‘జయసింహ’ అదే టైటిల్ కదా. ఆ రోజుల్లో అదొక సన్సేషనల్ హిట్.