బాలయ్య ‘జై సింహా’ ఫస్ట్ లుక్
on Nov 1, 2017
ఈ మధ్య బాలయ్య మీసాన్ని దించడం లేదు. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ నుంచి మీసాన్ని తిప్పే ఉంచుతున్నాడు. మొన్నొచ్చిన ’పైసా వసూల్’ లో కూడా మీసం తిప్పే కనిపించాడు. రాబోతున్న ‘జై సింహా’ లో కూడా మీసం తిప్పే కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే వైరల్ అయినా.. బుధవారం దర్శక, నిర్మాతలు అధికారికంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘జై సింహా’ అనే టైటిల్ ని కూడా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. కళ్లకు నల్ల కళ్లద్దాలు.. చేతిలో లాఠి.. కోరమీసం.. వ్యవహారం చూస్తుంటే.. ఇందులో బాలయ్య పోలీస్ గా చేస్తున్నాడా? అనే అనుమానం రాకమానదు. పైగా ఓ మూలు ప్రత్యేక ఆకర్షణగా ‘అన్నగారు’ విగ్రహం. ఏది ఏమైనా.. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార ఓ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తండ్రి ‘జయసింహ’గా ఘన విజయాన్ని అందుకున్నాడు.. మరి తనయుడు రేపు ‘జై సింహా’గా రాబోతున్నాడు. బాలయ్యకు మొదట్నుంచీ ‘సింహ’ అనే సెంటిమెంట్ కలిసొచ్చింది. బొబ్బిలిసింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా.. విజయ విహారం చేశాయ్. రాబోతున్న ఈ సినిమా కూడా హిట్ పక్కా. అని ఫిలింనగర్ టాక్.