English | Telugu

బాబాయ్ నోట్లోంచి ఊడిపడ్డాడు కదూ!

on Oct 30, 2017

వెంకటేశ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడా? ఎందులో స్టిల్స్ ఇవి? అనుకుంటున్నారా? ఒకేలా ప్రింట్ గుద్దినట్టున్న ఈ ముఖాలను చూస్తే ఎవరైనా అదే అంటారు. కానీ.. ఇక్కడున్న రెండు ఫొటోలూ వెంకటేశ్ వి కావ్. ఇందులో ఒకరు వెంకీ అయితే.. ఇంకొకరు రానా. అచ్చంగా 80ల్లో వాళ్ల బాబాయ్ ఎలా ఉంటాడో అలా తయారై.. ఓ సినిమా చేస్తున్నాడు రానా. సినిమా పేరు ‘1945’. ఈ ఫొటోలో ఆ మీసకట్టు, ఆ చూపు.. ఆ కోల ముఖం..  అంతా బాబాయ్ నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉన్నాడు కదూ. అందుకే సరదాగా... పాత వెంకీ ఫొటోను ఈ న్యూ స్టిల్ తో జత కలిపి మీ ముందుంచాం. 

రానా కెరీర్ చూస్తుంటే నిజంగా విచిత్రం అనిపిస్తుంది. ‘లీడర్’ సినిమాలో రానాను చూసి పెదవి విరవని వాడంటూ లేడు. ‘రా’ మెటీరియల్ అని బిరుదు కూడా ఇచ్చేశారు. అలాంటి రానా.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నటునిగా శభాష్ అనిపించుకుంటున్నాడు. కృష్ణవందే జగద్గురుమ్, బాహుబలి1, బాహుబలి 2, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి.. ఇలా వరుస విజయాలతో అందర్నీ ఆశ్చర్యానికి లోను చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న ‘1945’ కూడా వైరైటీ సినిమానే. ఈ దఫా కూడా రానా హిట్ కొట్టడం గ్యారంటీ. ఏమంటారు? 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here