English | Telugu

వెంకటేశ్, మహేశ్ ఫ్యాన్స్ కొట్టుకున్నారట!

on Oct 28, 2017

దక్షిణాది దర్శక, నిర్మాతలు హీరోయిన్లను బరువు పెరగమంటారట. చీర కట్టుకొని అటూ ఇటూ గెంతమంటారట. అంతేకాదు.. సౌత్ లో హీరోయిన్లను బబ్లీగా ఉంటేనే చూస్తారట. ఈ మాటలన్న అమ్మాయి పేరు ‘హీనా ఖాన్’. ‘బిగ్ బాస్ 11’ కంటెస్టెంట్ అనమాట. అసలు బరువు పెరిగితే బబ్లీగా ఉంటారా? బరువు పెరగమనడం దేనికీ? గెంతమంటం దేనికీ? హీనా ఖాన్.. ఇలాంటి హీనమైన కామెంట్లు ఎందుకు చేసింది? ప్రస్తుతం సోసల్ మీడియాలో ఈ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ఈ అమ్మాయి సినిమాల్లో చేసిందేమీ లేదు. టీవీ సీరియళ్లలో మాత్రం నటించింది. ఏదో దొరక్క దొరక్క ‘బిగ్ బాస్’ అవకాశం దొరికింది. ఇక నోటికి ఏదొస్తే అది పేలడం మొదలుపెట్టింది. తెలుగులో ‘సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అంజలి పాత్ర ముందు హీనా ఖాన్ నే వరించిందట. బరువు పెరగమన్నారని ఆ అవకాశాన్ని వదులుకుందట.

‘వెంకటేశ్ అంటే ఎవరనుకున్నారు? అదే... ‘అనారీ’ సినిమాలో కరిష్మాకపూర్ తో నటించాడే ఆయన. మహేశ్ బాబూ, వెంకటేశూ కలిసి ఈ సినిమాలో చేశారు. అక్కడ పెద్ద హిట్టయ్యింది తెలుసా? తెలుగులో వెంకటేశ్ ఫ్యాన్సూ, మహేశ్ ఫ్యాన్సూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పా అని కుర్చీలతో కొట్టుకున్నారట’ అంటూ అన్నీ తెలిసినట్టు ‘బిగ్ బాస్’లో మాట్లాడిందట. ఇదివరకంటే... ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా తెలిసేది కాదు. ఇప్పుడు మీడియా పెరిగిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని క్షణాల్లో వార్తలు జనాల్లోకెళ్లిపోతున్నాయ్. ప్రపంచంలో ఎవరు ఏం మాట్లాడినా? తెలిసిపోతోంది. మరి ఇదంతా తెలిసి హీనా ఖాన్ ఎందుకలా మాట్లాడిందో.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here