ENGLISH | TELUGU  

బాలయ్య సరసన క్రేజీ హీరోయిన్?

on Oct 14, 2017

 

బాలయ్యతో జోడీ కట్టడమంటే... ఇప్పట్లో హీరోయిన్లకు పండగ. అదో గోల్డెన్ ఆఫర్ గా ఫీలయ్యేవారు. కానీ... నేటి పరిస్థితి అలా లేదు. ఆయన వయసు పెద్దదవ్వడం... ఇప్పుడున్న క్రేజీ హీరోయిన్లందరూ పాతికేళ్ల లోపు వాళ్లే అవ్వడం... పైగా బాలయ్యతో జతకట్టడమంటే.. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయ్. వాటన్నింటికీ తలొగ్గే పరిస్థితుల్లో ఇప్పటి అమ్మాయిలకు లేరు. దాంతో... బాలయ్యకు కొన్నాళ్ల నుంచి హీరోయిన్ల కొరత మొదలైంది. నయనతార, శ్రియ.. ఇద్దరే బాలయ్యతో చేయడానికి ముందుకొస్తున్నారు తప్ప.. మిగిలిన హీరోయిన్లు బాలయ్య అంటే.. భయపడిపోతున్నారు.


ఇదిలావుంటే... ప్రస్తుతం నటసింహం.. కేఎస్ రవికుమార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ  సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే.. కథ రిత్యా ఇందులో మరో కథానాయికకు స్థానం ఉంది. ఆ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా? అని కొన్ని రోజులుగా దర్శక, నిర్మాతలు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ముందు ఆ అవకాశం.. ప్రగ్యా జైశ్వాల్ ని వరించింది. ఆమె దాదాపు ఖరారైందనుకుంటున్న సమయంలో... ప్రగ్యాను వెనక్కకు నెట్టి.. రెజీనా ఆ పాత్రకు ‘ఓకే’ అయ్యింది. బాలయ్య పక్కన నటించడానికి యంగ్ హీరోయిన్లు కూడా పోటీ పడటం ఈ మధ్య జరగలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు కుర్ర హీరోయిన్లు పోటీ పడిటం.. రెజీనా ఆ పాత్రకు సెలక్ట్ అవ్వడం నిజంగా ఆసక్తికరమైన విషయమే.
రేపు రెజీనా, బాలయ్యల చిందులు.. బాక్సాఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.