చరిత్ర సృష్టిస్తాడట!
on Oct 13, 2017
భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు... మళ్లీ నాటి ట్రెండ్ వచ్చేస్తోందండీ బాబూ. చారిత్రాత్మక చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయ్. మొన్న ‘రుద్రమదేవి’ వచ్చి సందడి చేస్తే.. నిన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ వేడి చల్లారకముందే... మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ చారిత్రాత్మక కథతో చరిత్ర సృష్టించడానికి రెడీ అయిపోతే... మరో వైపు సైలెంట్ గా మన భల్లాలదేవుడు రానా... ఎవరికీ తెలీకుండా 1945 నాటి కథతో సినిమా చేసేస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వివరాలను తీరిగ్గా... ట్వీట్ చేశాడు రానా. తీరా ఆరా తీస్తే... సుభాస్ చంద్రబోస్ కథతో ఈ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసింది. ‘ఆజాద్ హిందూ ఫౌజ్’అని టైటిల్ కూడా అనుకుటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలావుంటే... ఈ సినిమాలో రానాకు జోడీగా రెజీనా నటిస్తోందట. చెట్టీయార్ గారి కూతురుగా సంప్రదాయబద్దమైన పాత్రలో రెజీనా నటిస్తోందని సమాచారం. ఇందులో సుభాస్ చంద్రబోస్ గా రానా నటిస్తున్నాడని వినికిడి. ఇప్పటికే బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన రానా.. కసితో ఈ సినిమా చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోను రానా ట్విట్టర్ లో పెట్టాడు చూడండి.