‘బిగ్ బాస్’ సీజన్ 2... హోస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
on Oct 4, 2017
75 రోజుల పాటు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ చేసిన సందడి అంతాఇంతా కాదు. ‘బిగ్ బాస్’ సీజన్ వన్ విజేతగా శివబాలాజీ నిలిచిన విషయం తెలిసిందే. ఇక హోస్ట్ గా ఎన్టీయార్ అయితే... ఊహించని అనుభూతినే పంచాడు అందరికీ. ఎన్టీయార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే... ఇలా ఉంటుందా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. 75 రోజులు సందడి ఒక్కసారి చల్లబడగానే... మళ్లీ ‘బిగ్ బాస్’ సీజన్2 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మా టీవీ యాజమాన్యం కూడా ‘బిగ్ బాస్’ సీజన్ 2 ను త్వరలోనే మొదలుపెట్టడానికి సన్నాహాలు చే్స్తోంది. అయితే... ఈ దఫా ‘బిగ్ బాస్’ లో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయట. ముఖ్యంగా హోస్ట్ మారుతున్నాడనే వార్త.. ‘బిగ్ బాస్’ అభిమానులకు నిజంగా షాకే. ఎన్టీయార్ అభిమానులు కూడా ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
మరి వినిపిస్తున్న వార్తలో నిజం ఎంతుదో తెలీదు కానీ... వింటుంటే మాత్రం నిజమేనేమో అనిపిస్తోంది. ఈ దఫా హీరో నాని ‘బిగ్ బాస్’ హోస్ట్ గా వ్యవహరిస్తాడని సమాచారం. సరిగ్గా ‘బిగ్ బాస్’ టైమ్ లోనే... త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఎన్టీయార్ బిజీగా ఉంటాడట. అందుకే... సెకండ్ సిరీస్ కి తారక్ హ్యాండ్ ఇచ్చాడని తెలిసింది. దాంతో చేసేది లేక ‘బిగ్ బాస్’ యాజమాన్యం నానిని కలిశారట. మరి ఎన్టీయార్ స్థాయిలో నాని... ఆ బాధ్యతను నిర్వర్తించగలడా? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. నిజానికి నాని కూడా యమ చలాకీ. మంచి జోష్ గా ఉంటాడు. మరి ఆ స్పీడ్ బుల్లితెరపై కూడా చూపిస్తే... కచ్చితంగా సక్సెస్ అవుతాడని చెప్పొచ్చు.
ఇక ఈ దఫా హౌజ్ మేట్స్ గా... వరుణ్ సందేశ్, కమెడియన్ వేణు, తనీష్, హర్ష, లాస్య, గీతా మాధురి, చాందిని చౌదరి, గజాలా, ఆర్యన్ రాజేష్, ధన్యా బాలకృష్ణన్ ల పేర్లు వినిపిస్తున్నాయ్. అలాగే... మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తరుణ్, చార్మీ ఎంటర్ అవుతారట. ఈ లిస్ట్ చూస్తుంటే... ఈ వార్తలో నిజం ఉందేమో అనిపిస్తోంది కదూ.