ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ ఏంటో తెలుసా..?
on Oct 2, 2017
బాహుబలి తర్వాత ప్రభాస్ ఏం సినిమా చేస్తాడా.? ఎవరితో చేస్తాడా అన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇస్తూ సుజిత్ దర్శకత్వంలో సాహో చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రజంట్ ఆ సినిమా షూటింగ్ శరవేగంతో దూసుకెళ్తోంది. కథ ఏంటో తెలియదు కానీ..పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా యంగ్ రెబల్ స్టార్ కనిపిస్తున్నాడని..కాదు కాదు పీరియాడికల్ మూవీ అంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ మాత్రం ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడట. ఇందుకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోందట. అయితే తన ప్రతి పుట్టినరోజుకి అభిమానులను సర్ప్రైజ్ చేయడం ప్రభాస్‌కు అలవాటు. దీనిలో భాగంగా ఈ నెల 23వ తేదిన సాహో మేకింగ్ టీజర్‌ను రిలీజ్ చేస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. సమ్మర్ కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.