మన హీరోలు నిజాలు చెప్పేస్తున్నారండోయ్!
on Sep 22, 2017
ఒక్కోసారి మన హీరోలు నిజాలు చెప్పేస్తుంటారు. అప్పుడు వినడానికి భలే బావుంటుంది. మొన్నామధ్య బాలయ్య.. ఓ ఇంటర్ వ్యూలో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా గురించి మాట్లాడుతూ... ‘చిటెకేయగానే కుర్చీ ముందుకు రావడం ఏంటండీ? వేలు చూపించగానే... ట్రైన్ వెళ్లిపోవడం ఏంటండీ? ఆ టైమ్ లో వాళ్లు ఏం చెప్పారో... నేను ఏం విన్నానో.. అంతగా మాయగా ఉంది. నిజంగా వాటిని తలచుకుంటే నవ్వొస్తుంది.. అందుకేగా సినిమా పోయింది’ అని ఉన్నదున్నట్లు నిర్మొహమాటంగా చెప్పేశాడు.
బాబాయ్ అలా మాట్లాడితే... ఈ మధ్య అబ్బాయ్ ఎన్టీయార్ కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పేసి... అందరి మనసుల్నీ దోచేశాడు. ‘కంత్రి’ సినిమాలో ‘మనస్సునామీ... తాకెనమ్మీ... ’పాటలో... ఓ స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ ఎన్టీయార్ కి మంచి పేరు తెచ్చింది. నిజానికి ఆ స్టెప్ తమిళ హీరో విజయ్ ది. తమిళ‘పోక్కిరి’ సినిమా కోసం ఆ స్టెప్ వేశాడు. ఆ స్టేప్ ని మన తారక్... యాజిటీజ్ గా కాపీ కొ్ట్టేశాడు. ఈ విషయాన్ని ఈ మధ్య ఇంటర్ వ్యూలో చెప్పేసి తనకు ఇగో లేదని నిరూపించుకున్నాడు. అంతేకాదు... మీకిష్టమైన డాన్సర్ ఎవరని అడిగితే... బన్నీ పేరు చెప్పి... శభాష్ అనిపించుకున్నాడు ఎన్టీయార్.
ఇగోలకు దూరంగా ఇలాంటి అరోగ్యకరమైన వాతావరణం ఉంటే... అది అభిమానుల్లో కూడా మార్పు తెస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్?