అచ్చం ఆమెలాగే ఉంది కదూ!
on Sep 12, 2017
సావిత్రి.. ఈ పేరు వింటే... దక్షిణాది సినీ అభిమానుల కళ్లు విప్పారతాయ్. మనసులు పులకిస్తాయ్. ఆ తరం వారైతే... గత స్మృతుల్లో తేలిపోతారు. ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని అనుభూతులూ... నిజంగా ఆ మహానటి తెలుగు ప్రేక్షకులకు పంచిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. సావిత్రి ప్రభావం తెలుగుతెరపై అమోఘం. అది ఏ స్థాయిలో అంటే.. తర్వాత ఏ హీరోయిన్ బాగా నటించినా... ‘అబ్బా.. సావిత్రిని గుర్తుకుతెచ్చిందయ్యా!’ అనే స్థాయిలో. నేటికీ ఆమె తెలుగువారి అభిమాన నటే. తరాలు మారుతున్నా.. సావిత్రి అభినయ సుగంధం... నేటికీ పరిమళిస్తూనే ఉంది. అందుకే... ఆమె బయోపిక్ అనగానే... పెద్దలే కాదు.. పిల్లలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సావిత్రిగా నటించడం... సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే.. ఆమె జీవన గమనం... ఒడుదుడుకుల మయమే అయినా.. సినీ జీవితం మాత్రం కోటి రంగుల ఇంధ్రధనుస్సు. అందుకే... సావిత్రి పాత్రలో నటించడమంటే.. అది పెద్ద సాహసమే. అలాంటి సాహసానికి ఒడిగట్టింది కీర్తి సురేశ్. ప్రస్తుతం సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటిస్తూ కీర్తి యమ బిజీగా ఉంది. ఈ సినిమాలో జెమినీ గణేశన్ గా దుల్హన్ సల్మాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా విజయ్ దేవరకొండ, సమంత, ప్రకాశ్ రాజ్, రావురమేశ్... తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఇదిలావుండగా.. ఈ సినిమాకు చెందిన కొన్ని స్టిల్స్ అనుకోకుండా వెలుగు చూశాయ్. ఆ స్టిల్స్ లో కీర్తి సురేశ్.. దాదాపు సావిత్రినే తలపిస్తోంది. కావాలంటే మీరూ చూడండి.