పవర్ స్టార్ టైటిల్ ఫిక్స్?
on Sep 8, 2017
పవర్ స్టార్ - త్రివిక్రమ్ సినిమా పేరేంటి? ఇప్పటికే రకరకాల పేర్లు వినిపించాయ్. ‘ఇంజనీర్ బాబు’ అని ఒకరంటారు. గోకుల కృష్ణుడు’ అని ఒకరంటారు. ‘దేవుడే దిగివచ్చినా..’ ఇంకొకరంటారు. ఇంతకీ పవన్ సినిమా పేరేంటి? అభిమానుల్లో వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఇదిలావుంటే... వినిపిస్తున్న పేర్లు చాలవన్నట్లు.. ఇప్పుడు మరో పేరు వెలుగులోకొచ్చింది. అదే ‘అజ్ణాతవాసి’. పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దాంట్లో పవన్.. అలా ఎండమావులకేసి నడుస్తుంటాడు. ఈ స్టిల్ చూసిన తర్వాత ఈ సినిమాకు ‘అజ్ణాతవాసి’ అనే టైటిలే కరెక్ట్ అనిపిస్తోంది. మరి వినిపిస్తున్న ఈ పేరునే ఖరారు చేస్తారా? అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాలి.