నాలుగోసారి తండ్రి కాబోతున్న పవర్ స్టార్!
on Sep 4, 2017
పవర్ స్టార్ నాలుగోసారి తండ్రి కాబోతున్నారు. తన భార్య లెజ్ నోవా ప్రస్తుతం పూర్ణ గర్భవతి. అక్టోబర్ 14న ఆమెకు డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. దాంతో షూటింగ్ లతో, రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉంటున్న పవర్ స్టార్...సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని తన భార్య లెజ్ నోవాకు కేటాయిస్తున్నారు. పవన్ కి ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. తొలిభార్య రేణూదేశాయ్ కి పుట్టిన పిల్లలు ఇద్దరు. వారే అకిరానందన్, ఆద్య. వారిప్పులు అమ్మ దగ్గరే కలకత్తలో ఉంటున్నారు. రేణూదేశాయ్ తో వేరుపడ్డ తర్వాత లెజ్ నోవాను పవన్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరికీ ఇప్పటికే ఓ ఆడపిల్ల. ఆ పాప పేరు పొలేనా. త్వరలో లెజ్ నోవా మరో బిడ్డకు జన్మనీయనుంది. దీంతో పవన్ నాలుగోసారి తండ్రి కానున్నారు. రేణూదేశాయ్ తో విడిపడ్డ తర్వాత కూడా పవన్ తన పిల్లల బాధ్యతలను విస్మరించలేదు. ఇప్పటికీ రేణూ పిల్లల కోసం కూడా తాను సమయం కేటాయిస్తుంటారు.
వీలు దొరికినప్పుడల్లా కలకత్తా వెళ్లి తన పిల్లల్ని చూసుకొని, వారి యోగక్షేమానికి కావల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకొని వస్తుంటారు పవన్. అదే బాధ్యతను లెజ్ నోవా పిల్లల విషయంలో కూడా కనపరుస్తుంటారు. ఓ వైపు సినిమాలు. మరో వైపు రాజకీయాలు... ఇంకో వైపు ముగ్గురు బిడ్డల సాధకబాధలు. ఇవి చాలవన్నట్లు పవన్ మోయాల్సిన మరో బాధ్యత భూమి మీదకు రానుంది. నిజంగా పరిపూర్ణమైన జీవితం అంటే ఇదే కదా. పవర్ స్టార్... హేట్సాఫ్.