పైత్యం పరాకాష్టకు చేరడం అంటే ఇదే!
on Sep 2, 2017
కొంతమంది వ్యక్తుల ప్రవర్తన చూస్తే చిత్రంగా అనిపిస్తుంది. సెలబ్రిటీ అవ్వాలని అరాటమో... సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువై చేసే ఉబలాటమో తెలీదు కానీ... వారి పనులు అబ్ నార్మల్ గా అనిపిస్తాయ్. బహుశా... మానసిక పరిస్థితి బాగుండకో.. అమాకత్వం వల్లనో అలాంటి పనులు చేస్తుంటారని మనం భావించవచ్చు. కలకత్తకు చెందిన మోడల్ సుభద్రా ముఖర్జీ తీరు చూస్తుంటే.. ఆమె పరిస్థితి దాదాపు అలాగే ఉందని అనిపిస్తుంది. ఈమెగారు ఓ వ్యక్తిపై మనసుపడ్డారు. ఆయన ఎవరో కాదు. మన బాహుబలి.. మోస్ట్ ఎల్జిబుల్ బేచిలర్ ‘ప్రభాస్’. ప్రభాస్ పై మనసుపడ్డ అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. ‘బాహుబలి’ పుణ్యమా అని... ఇప్పుడు దేశవ్యాస్తంగా ప్రభాస్ కు లేడీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే... వారందరూ ప్రభాస్ తెరపై చూసుకొని మనసులోనే ఆరాధించేసుకునే రకం. కానీ... సుభద్ర అలా కాదు.. తన ప్రేమను నేరుగా ప్రభాస్ కే తెలియజేయాలని కంకణం కట్టుకుంది. దానికోసం ఓ భారీ ప్రణాళికనే సిద్ధం చేసుకుంది. ముహూర్తం అక్టోబర్ 23. ఆ రోజు ప్రభాస్ పుట్టిన రోజు. అదే రోజున ప్రభాస్ కి సుభద్ర ప్రపోజ్ చేయనుందట. ఈ విషయాన్ని ఆమే నేరుగా మీడియాకు తెలియజేసింది. స్వయంగా ప్రభాస్ సెక్రటరీనే ప్రభాస్ ని కలపుతానని హామీ ఇచ్చాడని సుభద్రా ముఖర్జీ తెలిపింది. ఆ రోజు కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, ప్రభాస్ పై తాను నాలుగు పాటలు రాసి, ఆ పాటల్ని ప్రముఖ గాయని ఉషా ఊతప్ తో పాడించానని, అదే రోజు ఆ పాటల్ని ప్రభాస్ కి వినిపిస్తానని, ఆ పాటల్లో తన మనసులోని భావాలను నింపానని సుభద్రా తెలిపింది. ప్రభాస్ పై తన ప్రేమ.. ఇంట్లోవాళ్లకు కూడా తెలుసని, వాళ్లు కూడా ప్రభాస్ ని ప్రపోజ్ చేయడానికి తనను ప్రోత్సహిస్తున్నారని సుభద్ర చెప్పింది. ‘బాహుబలి’ సినిమాల్లో ఒక్కోదాన్నీ 20 సార్లు చూసిందట సుభద్ర. ఆమె ఇంకా చెబుతూ... అక్టోబర్ 23న ప్రభాస్ కి ఎలా కనిపించాలి? ఎలా తయారవ్వాలి? ఎలా ప్రపోజ్ చేయాలి? ఈ ప్రశ్నలన్నీ నా మనసు తొలిచేస్తున్నాయ్.
రోజులు దగ్గరవుతున్న కొద్దీ ఒకటే టెన్షన్. కంచి నుంచి పట్టుచీర తెప్పించాను. అదే చీరలో ప్రభాస్ కి ప్రపోజ్ చేస్తా. అంతేకాదు... లక్షలు వెచ్చించి.. ‘బాహుబలి’ విగ్రహాన్ని చేయించాను. 20 వేలు ఖర్చుపెట్టి... కాస్ట్యూమ్ డిజైనర్ సమరేంద్ర సింగ్ రాయ్ తో ఆ విగ్రహానికి దుస్తుల్ని కూడా డిజైన్ చేయించాను. అదే రోజున ఆ విగ్రహాన్ని ప్రభాస్ కి బహూకరిస్తా. రాబోతున్న 23వ తారీఖున ప్రభాస్ ని ఎలా ప్రపోజ్ చేయాలో రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా... ప్రస్తుతం నా దినచర్య ఇదే’ అంటూ మురిపోతూ చెప్పింది సుభద్ర ముఖర్జీ. ఈ విషయాలు విన్నవారందరూ .. ‘అమ్మాయిగారి పైత్యం పరాకాష్టకే చేరింది’ అనుకుంటున్నారు. పిచ్చి పలు రకములంటారు కదా. ఇది కూడా అదే. ఏమంటారు?
Also Read