తీక్షణంగా చూస్తున్న కళ్ళు, నీ పయనం ఎటు వైపు...
on Sep 2, 2017
ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసారు. సినిమా టైటిల్ చెప్పక పోయినా, దాదాపు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తృప్తి పరిచే ప్రయత్నం చేసారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తీక్షణంగా ఆలోచిస్తూ ఎటు వైపో చూస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో అదే పవన్ కళ్యాణ్ ఒంటరిగా నడుస్తున్నాడు. మొత్తానికి, పవర్ స్టార్ మూడ్స్ తెలిపే విధంగా ఉంది ఈ కాన్సెప్ట్ పోస్టర్. అయితే, ముందుగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ, విడుదలకి ఇంకా చాలా రోజులు ఉన్నందున, ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసారు.
అత్తారింటికి దారేది తో పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ ప్రధాన కథానాయికలు. పవన్ కళ్యాణ్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ కి అధిపతిగా కనిపిస్తాడు అనే వార్తలు వచ్చాయి. అయితే, త్రివిక్రమ్ గత చిత్రాల కన్నా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని విశ్వాసనీయ సమాచారం. క్రేజ్ విప్పరీతంగా ఉండడంతో, బిజినెస్ దాదాపు అన్ని ఏరియా లకి క్లోజ్ అయింది. సంక్రాంతి సందర్బంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.