ENGLISH | TELUGU  

నంబర్ వన్ ఎవరో ఎప్పుడో తేలిపోయింది... కానీ!

on Sep 1, 2017

* పవన్ కల్యాణ్ సినిమా వస్తోందటంటే... అంచనాలు టాప్ లో ఉంటాయ్. విడుదలైతే.. వసూళ్లు టాప్ లో ఉంటాయ్. టీవీల్లో వస్తే... రేటింగ్ టాప్ లో ఉంటుంది. మీటింగ్ పెడితే జనాల సంఖ్య టాప్ లో ఉంటుంది. ట్విట్టర్ లో ఓ కామెంట్ పెడితే.. రెస్పాన్స్ టాప్ లో ఉంటుంది. ఈ జనరేషన్ హీరోల అభిమానుల్లో...  పవన్ అభిమానుల సంఖ్య టాప్ లో ఉంటుంది. అదీ ఆయన క్రేజ్. ఫంక్షన్ ఏ హీరోదైనా కావొచ్చు. ‘పవన్ కల్యాణ్’ అనే పేరు వినబడిందంటే... ఆడిటోరియం దద్దరిల్లిపోవాల్సిందే. ‘బాహుబలి ది కంక్లూషన్’ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ కి పవన్ కల్యాణే ఇమేజే  కదా ఇన్సిరేషన్.

* చిరంజీవి తర్వాత ‘నంబర్ వన్’ ఎవరు? ఈ ప్రశ్నకు జనాలు సమాధానం ఎప్పుడో ఇచ్చేశారు. అయితే.. అప్పుడే రాజకీయాలంటూ... అభిమానుల్ని సందిగ్థంలో పడేశాడు పవర్ స్టార్. తను సినిమానే సర్వస్వం అనుకుంటే... నంబర్ వన్ పవనే. అందులో నో డౌట్. 

* తెరమీద హీరో... దేవుడి స్థాయిలో ఆరాధించబడటం దక్షిణాదిన ఒక్కరి విషయంలోనే జరిగింది. ఆయనే ‘ఎన్టీయార్’. ఇప్పుడా మేజిక్.. పవన్ విషయంలో జరగడం విశేషం. ఎన్టీయార్ అంటే... పురాణ పాత్రల ద్వారా ‘దైవం మానుష రూపేణా’ అన్న నానుడిని నిజం చేశారు. మరి పవన్ అలాంటి పాత్రలేం చేయలేదు. అయినా... అభిమానులు ఆయన్ను దైవంతో సమానంగా ఆరాధిస్తారు. భక్తిగీతాలు పాడటం... స్తోత్రాలు వల్లించడం...లాంటివి కూడా ఆల్రెడీ చేసేశారు. ఎన్టీయార్ కి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గుళ్లున్నాయ్. ఇక పవన్ కి కట్టడమే తరువాయి. పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది.  

* పవర్ స్టార్ కి ఈ స్థాయి రావడానికి... లైఫ్ స్టైల్ కూడా ఓ కారణమే. తెరపై మాస్ హీరోగా మెరుపులు మెరిపిచే పవర్ స్టార్... తెర వెనుక అందుకు భిన్నంగా ఉంటాడు. పుస్తకాలు ప్రభావితం చేసిన వ్యక్తిలా కనిపిస్తాడు. ప్రకృతిని ఆరాధిస్తాడు. రైతులా బతకడానికి ఇష్టపడతాడు. 

* పొద్దున్నే ఆయన బ్రేక్ ఫాస్ట్ ఏంటో తెలుసా? ఆవు పాలు. ఆయనే కొన్ని ఆవుల్ని పెంచుతున్నారు. పాడికి చెందిన పనులు కూడా సాధ్యమైనంతవరకూ స్వయంగా చేస్తారు పవర్ స్టార్. పొద్దున్నే అరలీటర్ పచ్చి పాలు తాగడం ఆయన హాబీ. ఇక మధ్యాహ్నం.. కేవలం కాయగూరలు, పళ్లు తింటారు. భోజనం చేయరు. పవర్ స్టార్ భోంచేసి ఎప్పుడో తెలుసా? సాయంత్రం ఆరు గంటలకు. అంటే రోజుకు ఒక్క పూటే భోజనం అనమాట. 

* సాధ్యమైనంతవరకూ మన హీరోలందరూ తెరపై ఎలా కనిపిస్తారో... బయట కూడా అలానే కనిపించడానికి ఇష్టపడతారు. ఆ విషయంలో కూడా పవన్ భిన్నంగానే ఉంటారు. ఒక్కోసారి మాసిన గడ్డంతో కనిపిస్తారు. మరోసారి ఫుల్ గడ్డంతో కనిపిస్తారు. ఇంకోసారి... పంచె కట్టులో కనిపిస్తారు. మరోసారి లుంగీ కట్టుకొని కనిస్తారు. లాల్చీ ఫైజమాలోనూ కనిపిస్తాడు. ఎక్కువగా ఖాదీనే ప్రోత్సహిస్తాడు. అది పవన్ స్టైల్. 

* గిరి కీసుకొని బతికే మెంటాలిటీ ఉన్న వ్యక్తి పవన్. ఆయనకి ఇష్టమైన వాళ్లు కొందరే ఉంటారు. వాళ్లే ఆయన లోకం. పవన్ లోని అసలు వ్యక్తిని వాళ్లే చూస్తారు. పవర్ స్టార్ కి అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంటుంది. ఇప్పటికే లొకేషన్లలో చాలామంది కెమెడియన్లు ‘అతి’ చేసి పవన్ తో దొబ్బులు తిన్నవాళ్లే. ఆ మధ్య ఓ డైరెక్టర్ కి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. ఆ డైరెక్టర్ ఇప్పుడో అగ్ర హీరోతో సినిమా చేస్తున్నాడు. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది.(అది వేరే విషయం). 

* పవన్ కి ఉద్వేగమూ ఎక్కువే. భావోద్వేగమూ ఎక్కువే. మీటింగుల్లో పవన్ స్పీచ్ లు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అంతేకాదు... అభిమాని కోసం కన్నీళ్లు పెట్టుకునేంత సున్నితమైన మనసు పవర్ స్టార్ ది. 

ఒకే వ్యక్తి తెరపై ఒకలా కనిపించడం.. తెర వెనుక మరోలా అనిపించడం దక్షిణాదిన రజనీకాంత్, పవన్ కల్యాణ్ ల విషయంలోనే జరిగింది... జరుగుతోంది. బహుశా... ఈ లక్షణాలే పవన్ ని మిగతా హీరోల నుంచి వేరు చేసి ఉండొచ్చు. జనాల్లో అతనిపై ఆసక్తి పెరడగానికి కారణం అయ్యుండొచ్చు. 

మంచితనం, కొత్తదనం... ఎప్పుడూ పరిళమిస్తాయ్. ఇంతటి అసంఖ్యాక అభిమాన గణం పవన్ కి సొంతమవ్వడానికి కారణం అదే. ఈ రోజు పవర్ స్టార్ పుట్టిన రోజు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలనీ... విజయం ఆయన వెన్నంటే ఉండాలని ఆకాంక్షిస్తోందీ... ‘తెలుగు వన్’. 

 

- నరసింహ బుర్రా
 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.