ENGLISH | TELUGU  

"కింగ్" నాగార్జున బర్త్‌‌డే స్పెషల్

on Aug 28, 2017

నాగార్జున గురించి మీకు తెలియని విషయాలు! ("కింగ్" బర్త్‌ డే స్పెషల్)

 

‘విక్రమ్’ సినిమా వచ్చినప్పుడు ఆ కుర్రాడ్ని చూసి... ‘ఓరినాయనో... ఇహనుంచి ఈయన్ని భరించాలా?’ అని జనాలు తెల్లమొహం వేసేశారు. ఏదో ‘అక్కినేని బ్రాండ్’ పుణ్యమా? అని... ఆ సినిమా అలా అలా ఆడేసిందనుకోండీ. ‘ఇహ రెండో సినిమా కష్టమే’ అన్న నమ్మకం వ్యక్తం చేసినవారూ లేకపోలేదు. కానీ... తర్వాత అందరి అభిప్రాయాలూ తారుమారయ్యాయ్. ‘విక్రమ్’లో చూసిన ఆ గుంటకళ్ల కుర్రాడు... తర్వాత కాలంలో.. యువతరానికి ’యువసామ్రాట్’  అయ్యాడు.  అమ్మాయిల పాలిటి ‘మన్మథుడు’ అయ్యాడు. టాలీవుడ్ ‘కింగ్’ అయ్యాడు. ఇంకొన్ని సినిమాలతో శతచిత్ర కథాయకుని స్థాయికి చేరుకోబోతున్నాడు. ఆయనే అక్కినేని నాగార్జున. నేటితో ఆయనకు 58 ఏళ్లు నిండాయ్. అయినా... ఇంకా యువతరానికి ధీటైన గ్లామర్ తో వెండితెరపై దూసుకుపోతున్న ‘కింగ్’ గురించి... ఈ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.

 

 

* 1986లో విడుదలైన నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’కి... బాలీవుడ్ లో జాకీష్రాఫ్ కథానాయకునిగా నటించిన ‘హీరో’ చిత్రం మాతృక. హిందీలో ఈ కథను సుభాష్ ఘై దర్శకత్వం వహిస్తే... తెలుగులో వి.మధుసూదనరావు డైరెక్ట్ చేశారు. రెండు భాషల్లోనూ ఈ కథ సూపర్ హిట్ అవ్వడం విశేషం. 

 


* 1989... నాగార్జున కెరీర్ లో మరిచిపోలేని సంవత్సరం.. ఎందుకంటే... గీతాంజలి, శివ  చిత్రాలు అదే సంవత్సరం విడుదలయ్యాయ్. మణిరత్నం‘గీతాంజలి’ నాగ్ కెరీర్ లో ఓ మణిమకుటంగా నిలిస్తే... ‘శివ’ తెలుగు సినిమా నడకనే మార్చేసింది. 

 


* నాగార్జున కెరీర్లో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. వారిద్దరి కాంబినేషన్లో 9 సినిమాలొచ్చాయ్. అగ్నిపుత్రుడు, ఆఖరిపోరాటం, జానకిరాముడు, అగ్ని, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి, నమో వెంకటేశాయ.. వారి కలయికలో వచ్చిన సినిమాలు. 

 


* తమిళ లెజెండ్రీ యాక్టర్ శివాజీ గణేశన్ తో కూడా కలిసి నటించాడు నాగ్.  ఆ సినిమా పేరు ‘అగ్నిపుత్రుడు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. 

 


* నాగార్జున, అమల కలిసి నటించిన తొలి సినిమా ‘కిరాయిదాదా’. ఆ సినిమా తర్వాత చినబాబు, శివ, ప్రేమయుద్ధం, హిందీ ‘శివ’ చిత్రాల్లో  కలిసి నటించారు. వారి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ‘నిర్ణయం’. ఆ సినిమా తర్వాత వారద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. 

 


* నాగార్జున-విజయశాంతి కాంబినేషన్లో మూడే ముడు సినిమాలొచ్చాయ్. అందులో మొదటిది ‘జానకిరాముడు’కాగా,  రెండోది ‘విజయ్’. మూడో సినిమా ‘జైత్ర యాత్ర’ మూడు సినిమాలూ సరిగ్గా ఆడకపోవడం గమనార్హం. 

 

* నాగార్జునకు జోడీగా అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయిక ఎవరో తెలుసా? ఇంకెవరూ... మన రమ్యకృష్ణే. వారిద్దరూ కలిసి ఎనిమిది చిత్రాల్లో కలిసి నటించారు. 

 

* నాగార్జున పరిచయం చేసిన దర్శకుల సంఖ్య చాలా పెద్దది. అందులో ముందు చెప్పుకోవాల్సిన పేరు రామ్ గోపాల్ వర్మ. కొత్త దర్శకునితో నాగార్జున పనిచేసిన తొలి సినిమా కూడా ‘శివ’ సినిమానే కావడం గమనార్హం. ఆ తర్వాత ‘జైత్రయాత్ర’ ద్వారా ఉప్పలపాటి నారాయణరావు, ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతమురారండీ’ ద్వారా వైవీఎస్ చౌదరి, ‘ఎదురులేని మనిషి’ చిత్రం ద్వారా జొన్నలగడ్డ శ్రీనివాసరావు,  ‘సత్యం’ చిత్రం ద్వారా సూర్యకిరణ్, ‘ఉయ్యాల జంపాల’ ద్వారా విరించి వర్మ, ‘సోగ్గాడే చిన్నినాయనా’  ద్వారా కల్యాణ్ కృష్ణ, ‘నిర్మలా కాన్వెంట్’ ద్వారా నాగ కోటేశ్వరరావు... లను దర్శకులుగా పరిచయం చేశారు నాగ్. అంతేకాదు... అప్పటికే పలు తమిళ, మలయాళ భాషా చిత్రాలకు దర్శకత్వం వహించిన నటుడు ప్రతాప్ పోతన్ ని... ‘చైతన్య’ చిత్రం ద్వారా తెలుగుకు పరిచయం చేసిందీ నాగార్జునే. అలాగే పలు కన్నడ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించిన కన్నడ నటుడు రవిచంద్రన్ ని ‘శాంతి క్రాంతి’  చిత్రం ద్వారా దర్శకునిగా తెలుగుకి పరిచయం చేసింది నాగార్జునే. 

 

* నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు నాలుగు. అవి... హలోబ్రదర్, ఎదురులేని మనిషి, మనం, సోగ్గాడే చిన్నినాయనా. 

 

* నాగార్జున చేసిన మైథలాజికల్ కేరక్టర్స్... అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయి, హాదీరామ్ బావాజీ... త్వరలో ఓ పౌరాణిక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. 

 

* నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘రాజుగారి గది 2’. ఇది నాగ్ 88వ చిత్రం. ఇంకా నాగ్ శతచిత్ర కథానాయకుడు కావాలంటే..12 సినిమాలు చేయాలి. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.