నిర్మాతగా సరే ముందు సినిమా సంగతి చూడు..!
on Aug 26, 2017
ఈ తరం హీరోలు తమకు ఎన్ని కలలున్నా ముందు హీరోగా సెటిలై ఆ తర్వాత మిగిలిన డ్రీమ్స్ ఫుల్ ఫిల్ చేసుకునేందుకు ట్రై చేస్తారు. డ్రీమ్స్ అంటే ఏముంటాయండి..? సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టాలి..కుదిరితే మెగా ఫోన్ పట్టాలి అన్నదే వారి టార్గెట్..ఈ విషయంలో అందరికన్నా ముందుగా ఉన్నాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. ఓ పక్క తాను హీరోగా నటిస్తూనే కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాతగా అవతరామెత్తి తన తండ్రి చిరంజీవి నటించిన 150వ సినిమాను నిర్మించాడు చెర్రీ. ఆ తర్వాత 151వ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అంతేనా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న "సైరా నరసింహా రెడ్డి"ని బాహుబలికి మించిన హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించాలని చరణ్ కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇదంతా బాగానే ఉంది నిర్మాతగా ఆ మాత్రం ఉండకపోతే ఎలా..? కానీ తను ఒక హీరో అన్న సంగతి చెర్రి మరచిపోయినట్లున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో "రంగస్థలం 1985" అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. నిన్న మొన్నటి వరకు ఈ మూవీ షూటింగ్ చకచకా జరుగుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ఇఫ్పుడు ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లుగా జరగడం లేదట. సైరా నరసింహారెడ్డి పనుల్లో చరణ్ బిజీ బిజీగా ఉండటంతో రంగస్థలాన్ని కొన్ని రోజులు పక్కనబెట్టాలని డిసైడ్ అయ్యాడట. అంటే సినిమా సంక్రాంతికి రాదని స్పష్టంగా తెలుస్తోంది...ఈ వార్త చరణ్ ఫ్యాన్స్‌కి కాస్త నిరుత్సాహాన్ని కలిగించే విషయమే.