బాలయ్య అభిమానులకు స్కాలర్షిప్స్
on Aug 2, 2017
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పైసా వసూల్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా హీరోగా బాలకృష్ణకు 101వది. ఈ సందర్భంగా భవ్య క్రియేషన్స్ ‘పైసా వసూల్’ సినిమా విడుదలప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని బాలకృష్ణ అభిమానులు, అభిమానుల కుటుంబ సభ్యుల్లోని పదో తరగతి, ఇంటర్ చదువుతున్న 101మంది పేద విద్యార్థినీ, విద్యార్థులకు తమ హీరో నందమూరి బాలకష్ణగారి పేరు మీద స్కాలర్షిప్స్ ఇవ్వాలని నిర్ణయించింది. బాలకృష్ణ అభిమానులు, అభిమానుల కుటుంబ సభ్యులు ఈ స్కాలర్షిప్కు అర్హత పొందేందుకు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులకు ఇవ్వవలసి ఉంటుంది.
అయితే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డ్, స్కూల్ లేదా కాలేజ్ స్టడీ సర్టిఫికేట్ మరియు మార్క్స్ మెమోలను సదరు దరఖాస్తుకు జత చేయవలసి ఉంటుంది. దరఖాస్తులను అందజేయడానికి ఆగస్టు 10 ఆఖరు తేదీ. ఈ కింది జాబితాలోని బాలకృష్ణ అబిమాన సంఘాల అధ్యక్షులను ఆయా జిల్లాలకు చెందిన దరఖాస్తుదారులు ఫోనులో సంప్రదించి, తమ దరఖాస్తులను వారికి అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు "nbkpaisavasool.com" website క్లిక్ చేయగలరు. ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. అయితే... అభిమాన సంఘాల అధ్యక్షులు పంపించిన జాబితా నుంచి తుది జాబితను భవ్య క్రియేషన్స్ వారు ఎంపిక చేస్తారు.