డ్రగ్స్‌తో మీడియాకి అడ్డంగా దొరికిపోయిన రవితేజ..?
on Jul 14, 2017
కొద్దిరోజుల కిందట టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు భరత్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు..భరత్ అంత్యక్రియలకు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవ్వరూ హాజరుకాలేదు..అంతేందుకు స్వయంగా అన్నయ్య రవితేజే రాలేదు..భరత్ డ్రగ్స్ ఎడిక్ట్ అని..ఎప్పుడూ వివాదాలతో కాలం గడుపుతూ ఉంటాడని..రవితేజ కుటుంబం పరువు తీస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరిగింది. దీనిపై రవితేజ స్పందిస్తూ కొన్ని అనివార్య కారణాల వల్లే అంత్యక్రియలకు రాలేదని..దీనిపై ఏదిపడితే అది రాయొద్దని మీడియాకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలు రవితేజ వ్యక్తిత్వాన్ని శంకించేలా కనిపిస్తున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ వెనకున్న వ్యక్తులను బయటకు లాగడానికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది ..విచారణలో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. వారిలో రవితేజ కూడా ఉండటంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. కొన్నాళ్ల కిందట రవి ముఖం, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడంతో చాలా మందికి అనుమానం వచ్చింది. అయితే ఏజ్ తగ్గించుకునే చర్యల్లో భాగంగా చికిత్స చేయించుకోవడం వల్లే ఈ మార్పు వచ్చినట్లు వార్తలు వచ్చాయి..అది నిజం కాదనీ ఆయన డ్రగ్స్‌కు బానిస కావడం వల్లే ఈ మార్పులొచ్చాయని సినీ జనాలు చెవులు కొరుక్కున్నారు. అయితే పోలీసులు డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసులు ఇవ్వడంతో వారి అనుమానం నిజమైంది..ఇంతకీ మాస్ మహారాజ్ డ్రగ్స్ వాడాడో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..అప్పటి వరకు మీ అనుమానాన్ని.. అనుమానంగానే ఉంచండి.
Also Read