ENGLISH | TELUGU  

"మెగా" గ్రూప్ నుంచి బన్నీ ఔటేనా..?

on Jul 11, 2017

వరుస విజయాలతో స్టార్ రేసులోకి రేసుగుర్రంలా దూసుకొచ్చిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇప్పుడు ఏ మాత్రం కాలం కలిసి రావడం లేదేమో అనిపిస్తుంది. బన్నీ హీరో అయ్యింది..హీరోగా నిలబడింది అంతా మెగా ట్యాగ్‌లైన్‌తోనే అని టాలీవుడ్ మొత్తానికి తెలుసు.. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ సినిమాలను భుజాన మోశారు మెగా అభిమానులు..అయితే సొంతంగా ఓ ఫ్యాన్స్ బేస్‌ను ఏర్పాటు చేసుకుని మెగా ఫ్యాన్స్ బృందం నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బన్నీ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు..కానీ సందర్భం వచ్చినప్పుడల్లా మావయ్యకి తానెంత అభిమానినో వేదికలపై చెప్పుకుంటున్నాడు.

కానీ చెప్పను బ్రదర్ అన్న ఒకే ఒక్క మాటతో పవన్ అభిమానులకు బద్ధ శత్రువుగా మారిపోయాడు అల్లు అర్జున్..ఆ తర్వాత మెగా అభిమానుల్లో..పవన్ అభిమానులు బన్నీ సినిమాలను టార్గెట్ చేశారు. సరే పవర్‌స్టార్ ఫ్యాన్స్ లేకపోయినా మెగా అభిమానులు ఉన్నారు కదా అనుకుంటున్న టైంలో కోరి కోరివితో తలగొక్కున్నాడు బన్నీ..డీజే సినిమా ఖైదీ నెం. 150 కలెక్షన్స్‌‌ని క్రాస్ చేసిందని ప్రకటించడం మెగా అభిమానులకు ఆగ్రహం కలిగించింది. ఆ కలెక్షన్స్ ఎంత వరకు నిజమో తెలపాలంటూ మెగా ఫ్యాన్స్ హైదరాబాద్‌లోని డీజే ఆఫీసు వద్దకు చేరుకున్నారు..ఆ సమయంలో నిర్మాత దిల్‌రాజు వారిని చల్లబరిచే ప్రయత్నాలు చేసినప్పటికీ వారు కంట్రోల్ అవ్వకుండా ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు సమాచారం..దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చిందట. తాజా పరిణామాలన్నింటిని చూస్తుంటే బన్నీకి మెగా క్యాంపు మొత్తం దూరమయ్యే రోజులు దగ్గరిలోనే ఉన్నాయంటూ సినీ జనాలు చర్చించుకుంటున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.