అదే జరిగితే... ఇక యుద్ధమే..
on Jul 8, 2017
‘తాతగారి పాత్ర బాబాయి చేస్తాడంటున్నారు.. !’ అని మీడియా అడిగితే... ‘బ్రహ్మాండం కదండీ’అని సమాధానం ఇచ్చాడు తారక్. ఆ సమాధానం మనస్ఫూర్తిగా వచ్చిందా? వెటకారంగా వచ్చిందా? అనేది ప్రస్తుతం మీడియాలో చర్చగా మారింది. ఎన్టీయార్ అంటే ఓ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని, ఎన్టీయార్ కథ సినిమాగా తీయడం అనే నిర్ణయం తెలుగు ప్రజలందరి నిర్ణయంగా ఉండలని కూడా ఈ సందర్భంగా తారక్ చెప్పాడు.
అంటే.. అబ్బాయి ఉద్దేశ్యం ఏంటి? ఎన్టీయార్ బయోపిక్ నిర్మించే హక్కు బాబాయ్ కి ఉందనా? లేదనా?... పోనీ మీరు ఈ సినిమాలో నటిస్తారా? అనడిగితే... ‘ఇప్పుడేం అనుకోలేదడీ..’ అని దాటవేశాడు తారక్.
అయితే... ఎన్టీయార్ పాత్ర పోషించే అవకాశం మరో విధంగా తారక్ ని వరించింది. అదే ‘సావిత్రి’బయోపిక్ లో. అందులో కుర్ర ఎన్టీయార్ గా తారక్ తో నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తారక్ ఆ పాత్రకు ఒప్పుకుంటే... బాబాయ్, అబ్బాయిలకు వృత్తి పరంగా పెద్ద యుద్ధమే జరగవచ్చు. ఎలాగంటారా?
ఇటు ‘ఎన్టీయార్’బయోపిక్ లో ఎన్టీయార్ గా బాలకృష్ణ నటించనున్న విషయం తెలిసిందే. ఇటు ‘సావిత్రి’బయోపిక్ లో తారక్ కూడా తాతగారిలా కనిపించే అవకాశం లేకపోలేదు. దీంతో ‘ఎన్టీయార్’ గా బాబాయికి మార్కలు పడతాయా? అబ్బాయికి మార్కులు పడతాయా? అనేది ఆసక్తి కరమైన అంశం. ఇదే జరిగితే... పరణామాలు ఎలా ఉంటాయో..! అప్పుడిక ‘తాత’దిగిరాక తప్పదు మరి.