ఎన్టీఆర్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్
on Jul 5, 2017
నిన్న కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నానని చెప్పినప్పటి నుండి బాలకృష్ణ అభిమానుల గుండెల్లో గుబులు మొదలయ్యింది. అయితే, నారా లోకేష్ నందమూరి అభిమానులకి ఒక తీపి కబురు అందించారు. అదేంటంటే, ఆ సినిమా డైరెక్టర్ ఇంకా ఫైనలైజ్ అవ్వ లేదు అని. తాను పోర్చుగల్ కి వెళ్ళినప్పుడే మామయ్య బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చించుకున్నామని... బాలకృష్ణ నటిస్తున్నాడు కాబట్టి దర్శకుడు ఎవరయినా హిట్ కొట్టడం ఖాయం అని... అయితే, దర్శకుడు ఎవరు అన్న విషయంలో ఇంకా ఆలోచించ లేదని... వర్మ ఖరారయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
అయితే మరి, వర్మ అనుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్రలో హీరో బాలకృష్ణ కాదా! వాస్తవానికి, వర్మ కూడా తన ప్రకటనలో ఎక్కడ కూడా బాలకృష్ణ పేరు ప్రస్తావించ లేదు. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? వర్మ బాలయ్య బాబు ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడా? లేక వేరే ఎవరయినా హీరో తో ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాడా? వీటి పై క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!