కోట్లు కొల్లగొట్టిన దర్శకుడి కొత్త కారు
on Jun 20, 2017
సింపుల్ కు సరికొత్త నిర్వచనంగా ఉంటూ..తనకంటూ ప్రత్యేకమైన విలాసాలను సృష్టించుకోకుండా ..ఆడంబరాలకు తావు లేకుండా ఎందరికో మార్గదర్శిగా ఉంటూ ..సినీ వినీలాకాశం లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని .. అనునిత్యం సాదా సీదాగా నిరాడంబరం గా ఉండే దర్శక ధీరుడు రాజమౌళి.ఆయన తీసిన బాహుబలి చిత్రం ప్రపంచం నివ్వెర పోయేలా చేసింది.వేల కోట్లను కొల్లగొటింది.అయన బాహుబలి చిత్రం ద్వారా వేల కోట్ల ను సంపాదించుకున్నారు.
ఈ చిత్రం కోసం ఆయన కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా తమ శ్రమ ను ధార పోశారు.ఇంతటి విజయనానందం లో సంబరపడిపోయిన దర్శక ధీరుడు కోటి రూపాయల కొత్త కారు ను కొన్నారు. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండే రాజమౌళి తన బాహుబలి చిత్రం అందించిన అద్భుతం విజయం తో తీపి గుర్తుగా కోటి రూపాయల విలువ గల బిఎమ్ డబ్ల్యు 7 సీరీస్ వెహికల్ ను తీసుకున్నారు.ఆయన తీసుకున్న కొత్త కారు ఇప్పుడు అందరి ఆకర్షిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తీసే తర్వాత సినిమాపై ఉంది.ఆయన ఏ రకమైన సినిమా తో రానున్నాడో అనేది అందరిలో ఉత్కంఠ ను రేపుతుంది.