రేపల్లే కాదు..రంగస్థలం 1985
on Jun 9, 2017
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న సినిమా టైటిల్ మారిపోయింది. సినిమా ఎనౌన్స్ అయిన దగ్గరి నుంచి రేపల్లే అనే పేరును ఫిక్స్ చేశారు. అయితే సుకుమార్ తయారు చేసిన కథ, హీరో క్యారెక్టరైజేషన్ బట్టి చూస్తే సినిమాకు రేపల్లే అనే పేరు అంత మ్యాచ్ కాదని చిత్రయూనిట్ భావించింది. దీనిలో భాగంగా టైటిల్ మారిస్తేనే మంచిదని భావించి కొత్త టైటిల్ కోసం వెతికింది. ఈ నేపథ్యంలో సినిమాకి రంగస్థలం 1985 అనే పేరును ఖరారుచేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో చెర్రీ పక్కన సమంత హీరోయిన్గా నటిస్తోంది. 2018 సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు.