దంగల్ కి చెక్ పెట్టనున్న బాహుబలి
on May 25, 2017
ఈ మధ్యే చైనా లో విడుదలైన ఆమిర్ ఖాన్ చిత్రం దంగల్ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా- 123 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా 793 కోట్లు. ఇంతటి ఘన విజయం దంగల్ మేకర్స్ కి కూడా విస్మయం కలిగించి ఉంటది. బాహుబలి 2 కి చాలా దూరంలో ఉండిన దంగల్, చైనా కలెక్షన్స్ కలుపుకొని దాదాపు దరిదాపుల్లోకి వచ్చింది. ఇంకొకరైతే కుళ్ళుకునే వారేమో, కానీ బాహుబలి నిర్మాతలు మాత్రం ఇది మంచి పరిణామమే అని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. దంగల్ ద్వారా భారతీయ సినిమా చైనాలో మార్కెట్ విస్తరించుకుంది.
సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో బాహుబలి 2 అక్కడ విడుదల చేస్తే భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయం. చైనా లో పలు డిస్ట్రిబ్యూటర్లు బాహుబలి 2 పంపిణీ హక్కుల కోసం నిర్మాతల్ని ఇప్పటికే సంప్రదించారని సమాచారం. ఇండియా లో, ఇతర దేశాల్లో బాహుబలి 2 విజృంభణ చుసిన తర్వాత చైనా లో కూడా ఆ సినిమా కుమ్మేస్తుంది అనేది వారి అభిప్రాయం. జూన్ లో చైనా, కొరియా మరియు జపాన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియా లో లాగ అక్కడ కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే, దంగల్ కాదు కదా వేరే ఏ సినిమా కూడా బాహుబలి 2 రికార్డుల్ని అధిగమించడం ఇప్పట్లో అసాధ్యం.