సమంతని మహిళాలోకం క్షమిస్తుందా?
on May 24, 2017
గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చున్నాడు చలపతిరావు. టార్గెట్ ఆయన్నే చేసినా... చాలామంది డొంకలు కదులుతున్నాయి. పాత తప్పులు కొత్తగా గుర్తొస్తున్నాయి. దాంతో నెటిజన్లు టార్గెట్ చేస్తున్నవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వాళ్లలో సమంత కూడా ఉంది. వన్ - నేనొక్కడినే సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ చూసి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది సమంత. అసలు మహిళా లోకం ఏమైపోతోంది? అనే రేంజులో స్పీచులు దంచికొట్టింది. సమంత ఫైర్ చూసి అంతా అవాక్కయ్యారు. మహేష్ ఫ్యాన్స్ హర్టయ్యారు. ఆ ఎపిసోడ్ ఇప్పుడు మళ్లీ గుర్తొచ్చింది జనాలకు. ఒక్క పోస్టర్ చూసే అంతలా కదిలిపోయిన సమంత `పక్కలోకి పనికొస్తారు` అనే డైలాగ్‌ని ఎందుకు లైట్ తీసుకొంది? చైతూ సినిమా కాబట్టి, దానికి డామేజ్ జరగడం ఇష్టం లేదు కాబట్టి వదిలేసిందా? మామ గారు డబ్బులు పెట్టారు కాబట్టి, నెగిటీవ్ గా మాట్లాడకూడదని నోరు మూసుకొందా? అసలు ఈ ఎపిసోడే చెవికి ఎక్కలేదా? అంటే తన సినిమా అయితే ఓ రూల్.. బయటి వాళ్ల సినిమా అయితే మరో రూలా?? సమంతది రెండు నాలుకల ధోరణా?? ఇంత రాద్దాంతం జరుగుతున్నా సమంత నోరు మెదపకపోవడం మహిళా లోకం గమనిస్తూనే ఉంది. చలపతి రావు అవాకులు చెవాకులు పేలుతున్నప్పుడు అక్కడే ఉన్న రకుల్... కాస్త లేటుగా అయినా స్పందించి తన పాపాన్ని కడిగేసుకొంది. మరి సమంత ఇప్పటికైనా నోరు విప్పుద్దా? ఈ ఎపిసోడ్‌ని గనుక సమంత లైట్ తీసుకొంటే మాత్రం మహిళా లోకం సమంతని క్షమించదు గాక క్షమించదు.