రెండోసారి నిరాశపరచనున్న దర్శకుడు..!
on May 18, 2017
ఆధునాతన సాంకేతికత తో చరిత్ర సృష్టించిన సృజనాత్మక దర్శకుడు శంకర్ తెరకెక్కించిన రోబో చిత్రానికి కొనసాగింపుగా '2 .0 ' చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకం గా రాబోతున్నది.కథానాయకుడు రజనీకాంత్,ప్రతి కథానాయకుడు అక్షయ్ కుమార్ సరికొత్త గెటప్ లతో కనువిందు చేయనున్న ఈచిత్రం అందరిలో భారీ అంచనాలను నెలకొల్పేలా చేసేసింది.అయితే ఈ చిత్రం కై అందరిలో ఎదురు చూపులు తార స్థాయిలో నిలిచిపోయాయి. ఈ చిత్ర విడుదల విషయం లో చిత్ర బృందం మరో సారి అందరిని నిరాశ పరచబోతున్నట్లు సమాచారం.
ముందుగా దీపావళి కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.కానీ ఆ సమయం వరకు చిత్ర సంబంధిత పనులు పూర్తి కావన్న ఉద్దేశంతో జనవరి 25, 2018న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ బాహుబలి ప్రభంజనాన్ని కనులారా చూస్తున్నందున ఈ భారీ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా తీసుకువెళ్లాలన్న ఆలోచనల్లో చిత్రబృందం పడిపోయినట్లు తెలుస్తుంది. ఈ దృష్ట్యా భారీ కసరత్తు చేయవలసి వస్తున్నందున ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 , 2018న విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ముచ్చటగా మూడోమాట త్వరలో చెప్పనున్నట్లు వినిపిస్తుంది.
Also Read