పవన్.. ఇంతకు మించిన జోక్ ఏమైనా ఉందా?
on May 15, 2017
మాట్లాడితే చాలు.. సినిమాలపై నాకు వ్యామోహం లేదు అనేస్తుంటాడు పవన్ కల్యాణ్. సినిమాల కంటే తనకు రాజకీయ జీవితమే ముఖ్యమని, ప్రజా సేవలో తరిస్తానంటూ స్టేట్మెంట్లు గుప్పిస్తుంటాడు. ఈ మాటలన్నీ వినడానికి బాగుంటాయి. కానీ.. మాటలకూ, తాన చేతలకూ పొంతనే ఉండడం లేదు. కేవలం తన సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నానని, లేదంటే ఎప్పుడో సినిమాలకు దూరమై రాజకీయ సేవలో ఉండేవాడ్నని తాజాగా స్టేట్మెంట్ విసిరాడు పవన్.
ఆయన గారి పారితోషికం దాదాపుగా రూ.30 కోట్లు. ఇన్ని కోట్లూ.. సిబ్బందికే వాడేస్తున్నాడా?? ఇది మరీ టూమచ్‌గా లేదూ. సినిమాల్లో ఉండి, సినిమాల్లో సంపాదించి, సినిమాలతోనే పేరు తెచ్చుకొన్న పవన్ లాంటి వాళ్లు ఇలా మాట్లాడతారా?? జనసేన పార్టీ ప్రకటించినప్పటి నుంచీ పవన్ జనం మధ్యన ఉన్న సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ట్వీట్లు మాత్రం బోలెడన్ని చేస్తుంటాడు. కానీ.. చేతలే కనిపించడం లేదు. అలాంటి పవన్.. సిబ్బంది కోసమే సినిమాలు చేస్తున్నా, లేదంటే మానేసేవాడ్ని అని చెప్పడం అతి పెద్ద జోక్ గా మారిందిప్పుడు. ఈ కామెంట్‌పై జోకులు పేలుస్తూ.. ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్లలోనూ పవన్ యాంటీ ఫ్యాన్స్ తెగ ఆడేసుకొంటున్నారు. పవన్ ఎప్పుడు మారతాడో, ఏంటో??