చరణ్‌తో రివేంజ్ గేమ్.. పవన్‌తో క్రేజీ గేమ్
on May 13, 2017
ఆది పినిశెట్టి హీరో గా కొన్ని సినిమాలు చేసినా సరైనోడు లో విలన్ క్యారెక్టర్ కి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో పిచ్చ బిజీ గా ఉన్నాడు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న గ్రామీణ నేపథ్య సినిమా చేస్తున్న ఆది, పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. అయితే, చరణ్ సినిమాలో ఆది చేసే పాత్ర హీరోకి సమానంగా ఉంటుందట. తాజా సమాచారం ప్రకారం, ఆది చరణ్ కి సోదరుడిగా చేస్తున్నాడు. ఇందులో ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. రివేంజ్ డ్రామా స్టోరీ అని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికోస్తే, ఇందులో ఆది క్యారెక్టర్ చాలా క్రేజీ గా ఉంటుందట. తన పార్ట్ మొత్తం ఫారిన్ లో ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఆది కెరీర్ ని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తుందని నమ్ముతున్నాడు. ఇవి కాకుండా, నాని సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్న ఆది, ఇంకొన్ని సినిమాలు చేయడానికి అంగీకరించాడు. అయితే, సరైనోడు విజయం తర్వాత, ఆది తన పాత్రకి ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ పక్కకు పెడితే, రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచాడట. మరి డిమాండ్ ఉన్నప్పుడే కదా డిమాండ్ చేయాలి.
Also Read