ప్రభాస్‌లో ఆ కోణం ఉందంటే..ఓ రేంజ్‌కు వెళ్లిపోతాడు
on May 10, 2017
ఏ హీరోకైనా నవరసాలు పోషించే టాలెంట్ ఉండాలి.. మిగతా వాటి సంగతి ఏమోగానీ హీరోలు హస్యరసాన్ని పండించగలిగితే చాలు..టాప్ ప్లేస్ కన్ఫర్మ్. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయ్యింది. ఎన్టీఆర్, ఎఎన్నార్, చిరంజీవి, పవన్, మహేశ్, ఎన్టీఆర్ వీరంతా కామెడీని అద్భుతంగా పండించారు కనుకే వాళ్లని జనం అంతగా ఆరాధించారు..ఆరాధిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. నెంబర్‌వన్ ప్లేస్ కోసం నిన్న మొన్నటి వరకు ఒకరిద్దరి హీరోల మధ్యే ఉన్న పోటీ ప్రభాస్ రాకతో ట్రయాంగిల్ స్టోరీగా మారింది.
మంచి కటౌట్ కావడమో ఏమో కానీ తొలి నుంచి ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లో బాగా నటించేవాడు..సినిమా, సినిమాకి తనలోని నటుడిని రాటు దేలుస్తూ ఇప్పుడు ఒక పరిపూర్ణమైన నటుడిగా మారిపోయాడు. ఇక కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ మూవీ ఈశ్వర్ నుంచి నిన్న మొన్నటి బాహుబలి వరకు ఈ విషయం ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. బాహుబలి మొదటి భాగంలో రౌద్రరసాన్ని పండించిన ప్రభాస్ పార్ట్-2లో ఇంకెంత విధ్వంసం సృష్టించి ఉంటాడో అనుకున్న వారిని మొదటి అర్ధభాగం తెగ నవ్వించేశాడు..ఇది చూసిన వారు ప్రభాస్ కామెడీ పండించడంలో ఇంత ఎదిగిపోయాడా అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సూపర్‌స్టార్..ఎవరు అందుకోలేని స్థాయిలో ఉన్నాడు..ఆయన ఇలాంటి భారీ విజయాలు అందుకోవాలని కోరుకుందామ్.