బాహుబలిని చూసి బన్నీపై ఫోకస్ పెట్టారు
on May 10, 2017
ప్రజంట్ బాలీవుడ్ టూ కోలీవుడ్ దాకా ఏ వుడ్ చూసినా బాహుబలి నామస్మరణే..మహామహులకు కూడా సాధ్యం కాని స్థితిలో వెయ్యి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఆ దెబ్బతో తెలుగు సినిమా ఎంత సత్తా ఉందో కొంతమందికి తెలిసివచ్చింది. దీంతో వారి చూపు త్వరలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలపై పడింది. ప్రజంట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీని తెలుగుతో పాటు మలయాళం, హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డీజే ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోందట..హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనే సుమారు రూ.7 కోట్లు వచ్చాయట. బాహుబలిని మినహాయిస్తే..ఇప్పటిదాకా సర్దార్ గబ్బర్ సింగ్‌దే అక్కడ రికార్డు..ఇప్పుడు డీజే దాని తర్వాతి ప్లేస్‌ను కొట్టేసింది. అంతకుముందు పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ రూ.8.25 కోట్లను హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో సొంతం చేసుకుంది. బాహుబలి స్పూర్తితో డీజే కూడా అక్కడ సత్తా చాటాలని కోరుకుందాం.
Also Read