బాహుబలి 2 - మరో వందేళ్లు చెప్పుకోదగ్గ సినిమా!
on Apr 27, 2017
ఏదన్నా సినిమా విజయవంతం అయితే దానికి సీక్వెల్ తీయడం సహజమే! ఆ సీక్వెల్ అంచనాలకి అందుకోలేక దారుణంగా చతికలపడటం అంతే సహజం. కానీ బాహుబలి -2 మాత్రం ఇందుకు మినహాయింపంటూ మెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు. సినిమా మొదలైన అరగంటకే... ఇది మొదటి భాగాన్ని తలదన్నిన సినిమా అంటూ సంబరపడిపోతున్నారు. బాహుబలి -2 వందేళ్లపాటు చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. పట్టున్న స్ర్కీన్ప్లేకి ప్రభాస్, నాజర్, అనుష్కల నటన తోడవడంతో బాహుబలి మరోసారి రికార్డులు సృష్టించడం ఖాయమన్నది ట్రేడ్ వర్గాల అంచనా!