సెన్సార్ పూర్తయింది, బాహుబలి 2 ఎలా వచ్చిందో తెలుసా?
on Apr 18, 2017
బాహుబలి మొదటి భాగం మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కొందరు సినీ ప్రముఖులు, విమర్శకులు ఇందులో అసలు కథ ఉందా, కళ్ళు జిగేల్ మనిపించే విజువల్స్ తప్ప, అని తమ అభిప్రాయం వెలిబుచ్చారు. వాస్తవానికి, రాజమౌళి కూడా ఒప్పుకున్న విషయం ఏంటంటే, బాహుబలి మొదటి భాగంలో పెద్దగా కథ ఉండదు, క్యారెక్టర్ల పరిచయం మరియు యుద్ధం తప్ప. 'కథంతా రెండవ భాగంలో ఉంటుంది, మొదటి భాగాన్ని మించిన అందమైన విజువల్స్, యుద్ధ సన్నివేశాలు, డ్రామా, మొదలగునవి ఇందులో ఉంటాయి ,' అని రాజమౌళి పలు చోట్ల చెప్పిన సంగతి తెలిసిందే.
బాహుబలి 2 సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తయ్యాయి. సెన్సార్ వాళ్ళు సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. బాహుబలి 2 ఎలా వచ్చిందో ల్యాబ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. ఇంటర్వెల్ వరకు కథ కొంచెం మాములుగానే ఉంటుందట. కానీ, అక్కడి నుండి వేగం పుంజుకుంటుందట. క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు, ప్రభాస్-రానా సీన్స్, ప్రభాస్-అనుష్కల రొమాన్స్, రాజమౌళి మార్క్ గ్రాండియర్ సినిమాకి హైలైట్స్ అని తెలిసింది. మొత్తానికి, బాహుబలి 2 సినీ ప్రేమికులని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది అని అంటున్నారు. చూద్దాం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో.