బాహుబలికి బలవుతున్న కాటమరాయుడు
on Mar 28, 2017
కాటమరాయుడు రూపంలో పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో ప్లాప్ పడనుంది. సోమవారం అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ వీక్ గా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ రోజు పరిస్థితి కూడా అంతంత మాత్రం అని చెబుతున్నారు. భారీ మొత్తం లో వెచ్చించి కొన్న బయ్యర్లు ఈ దెబ్బకి గజా గజా వణుకుతున్నారు. ఇదిలా ఉంటే, కాటమరాయుడు ని ఈ వారం చాలా థియేటర్ల నుండి తీసేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కువ చోట్ల పవన్ క్లోజ్ ఫ్రెండ్ అయినా వెంకటేష్ గురు సినిమా రీప్లేస్ చేయనుంది. ఇంకొన్ని థియేటర్లు పూరి జగన్నాధ్ రోగ్ వశం కానున్నాయి.
ఇవి కాకుండా ఈ వారం ఇంకొన్ని సినిమాలు విడుదలవనున్నాయి. మాములుగా అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే భయపడే చిన్న, మధ్య తరగతి నిర్మాతలు ఈ సారి ఎందుకంత ధైర్యం చేస్తున్నారంటే, వచ్చే నెలలో రాజమౌళి బాహుబలి 2 విడుదలవనుంది. కనీసం నెల రోజుల వరకు థియేటర్లు దొరికే అవకాశం లేదు. అందుకే నిర్మాతలందరూ తమ సినిమాల విడుదల విషయంలో తొందర పడుతున్నారు. దానికి తోడు, కాటమరాయుడు డివైడ్ టాక్ వచ్చి పెద్దగా ఆడడం లేదు. ఈ వచ్చే మూడు వారాల్లో డజను పైగా సినిమాలు విడుదలవనున్నాయి. ఏదేమైనా బాహుబలి 2 రూపంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు కి పెద్ద దెబ్బ పడింది అని చెప్పొచ్చు.