ట్రైలర్ రివ్యూ: గురు
on Mar 21, 2017
బాబు బంగారం తరవాత మరో సినిమా ఏదీ చేయలేదు వెంకటేష్. కొంత గ్యాప్ తీసుకొని హిందీ సినిమా సాలా ఖదూస్ రీమేక్‌కి శ్రీకారం చుట్టాడు. అక్కడ దర్శకత్వం వహించిన సుధా కొంగరే... ఈ రీమేక్‌ని తెరకెక్కించే బాధ్యత తీసుకొన్నారు. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన గురు వేసవి బరిలో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ బయటకు వచ్చింది. 90 సెకన్ల ఈ టీజర్లో... వెంకీ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. రగ్గడ్ లుక్‌తో ఆకట్టుకొన్నాడు.
ట్రైలర్ చూస్తే ఓ సిన్సియర్ కోచ్ పాత్రలో వెంకీ.. తప్పకుండా విజృంభించేసి ఉంటాడు అన్న నమ్మకం కలుగుతుంది. సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఆకట్టుకొంటాయి. అయితే హిందీ సినిమాని ఉన్నది ఉన్నట్టుగా తీసేసిన ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులూ, చేర్పులూ ఏం చేయలేదన్న అనుమానం కలిగింది. కొన్ని షాట్స్ కూడా.. సేమ్ టూ సేమ్ దింపేశారు. కథానాయిక రితికా సింగ్... ఈసినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. హిందీ సాలా ఖదూస్లో మాధవన్‌తో పోటీ పడి నటించింది రితికా. ఇక్కడ కూడా వెంకీని డామినేట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. వెంకీ రీమేక్‌ల సెంటిమెంట్ గురుతోనూ వర్కవుట్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. ఈ వేసవిలో గురు తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాడన్న భరోసా కలుగుతుంది. ఆల్ ద బెస్ట్ గురూ.