కట్టప్ప..సమాధానం లేని ప్రశ్నే
on Mar 16, 2017
నిన్న మొన్నటి వరకు వార్తలు, వార్తల్లోని వ్యక్తులను పక్కకు తోసి ఒక విషయం గురించి తెలుగు రాష్ట్రాలు కాదు..భారతదేశం కాదు...ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. అదే బాహుబలి-2 ట్రైలర్. బాహుబలి బిగినింగ్‌లో కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలకు కన్‌క్లూజన్‌లో ఆన్సర్ ఉంటుందని జక్కన్న ముందే చెప్పాడు. ఆ సమాధానం దొరకని ప్రశ్నల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేదే "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?" ఈ ప్రశ్నకు సమాధానం కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు.
ఇవాళ బాహుబలి-2 ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో జనం ఆ ట్రైలర్‌ని కళ్లు అప్పగించి చూశారు. కాని చిన్న క్లూ కూడా దొరకలేదు. ట్రైలర్లో కట్టప్ప బాహుబలిని వెనుక నుంచి పొడిచే సన్నివేశాన్ని మెర్జ్ చేశాడు కాని రాజమౌళి ఆన్సర్ మాత్రం చెప్పలేదు. అయితే టీజర్ చివరిలో ప్రభాస్ సింహసనంలో కూర్చొని ఉండగా..కట్టప్ప మోకాళ్ల మీద కూర్చొనే సీన్ ఉంది..అంటే అక్కడ ఏదో మిస్టరీ ఉందన్న మాట. ఆ సిన్ కత్తితో పొడవటానికి ముందో..పొడిచిన తర్వాతో జరుగుతుందని అర్థమవుతుంది..ఆ మిస్టరీ ఎంటో తెలుసుకోవాలంటే ఏప్రిల్ 28 దాకా వెయిట్ చేయాల్సిందే.