దిల్‌రాజు భార్య అనిత అంత్యక్రియలు పూర్తి
on Mar 13, 2017
ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు భార్య శ్రీమతి అనిత అంత్యక్రియలు ముగిశాయి. శనివారం సాయంత్రం గుండెపోటుకు గురవ్వడంతో ఆమె కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత తుదిశ్వాస విడిచారు. ఆమె మరణించిన సమయంలో దిల్‌రాజు ఫిదా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు. భార్య మరణవార్త తెలిసిన వెంటనే రాజు ఇండియా బయలుదేరారు. అనంతరం ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అనిత అంత్యక్రియలు ముగిశాయి. అంతకు ముందు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అనిత భౌతిక కాయానికి నివాళి అర్పించారు.