విన్నర్ : ఇన్ సైడ్ టాక్
on Feb 20, 2017
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం విన్నర్ విడుదలకు సిద్ధమైంది. ప్రచార కార్యక్రమాలు సైతం జోరుగా సాగుతున్నాయి. మాస్, మసాలా, కమర్షియల్ సినిమాగా ముద్రపడిన విన్నర్‌కు సంబంధించిన ఇన్ సైడ్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ వన్ మ్యాన్ షో చేశాడని, సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్‌తో నడిపించేశాడన్న టాక్స్ వినిపిస్తున్నాయి.
తమ్ముడు ని గుర్తు చేసే కథకథనాలతో వండిన ఈ సినిమా... కథ పరంగా కొత్తగా ఏం లేదని, అయితే టేకింగ్ టెక్నిక్‌తో ఈ సినిమాకి కొత్త ఫ్లేవర్ అద్దారని సమాచారం. ఓ పాట, ఓ ఫైటు, ఓ ట్విస్టు.. సినిమా అంతా ఇదే పద్ధతిలో సాగుతుందట. తొలి భాగం ఫన్ బాగానే వర్కవుట్ అయ్యిందని, సెకండాఫ్‌లో కమర్షియల్ దినుసులు కాస్త గట్టిగా తగిలించారని, ముఖ్యంగా రకుల్ ఓ రేంజులో రెచ్చిపోయిందని, తన ఎక్స్పోజింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని తెలుస్తోంది.
తమన్ అందించిన పాటలు సోసోగా ఉన్నా, వాటికి సాయిధరమ్ తేజ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయని చెబుతున్నారు. కొత్తపాయింట్ లేకపోయినా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దడంలో గోపీచంద్ మలినేని విజయవంతం అయ్యాడని, బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లు తెచ్చుకొనే అవకాశాలున్నాయని అంటున్నారు. చూద్దాం.. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో?!
Also Read