సమంత పరువు తీసిన లాస్య!
on Feb 5, 2017
అటు హీరోయిన్ సమంత.. ఇటు టీవీ యాంకర్ లాస్య. ఇద్దరిలో ఎవరు గొప్ప, ఎవరు పాపులర్, ఎవరికి ఎక్కుమంది అభిమానులున్నారు అని అడిగితే నిస్సందేహంగా సమంత పేరే చెబుతారంతా. కానీ పాపులారిటీ విషయంలో సమంతని దూరంగా నెట్టేసింది లాస్య! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అందుకు తాజా ఉదాహరణేంటంటే... ఇటీవల సమంత, లాస్య ఇద్దరి నిశ్చితార్థం దాదాపుగా ఒకేసారి జరిగాయి. నాగచైతన్యతో సమంత నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గాజరిగిన సంగతి తెలిసిందే. టీవీ యాంకర్ లాస్య కూడా తన ప్రియుడు మంజునాథ్ వేలికి ఉంగరం తొడిగేసింది. ఈ రెండు నిశ్చితార్థాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
యూ ట్యూబ్‌లో అటు సమంత, ఇటు లాస్య నిశ్చితార్థాలకు సంబంధించిన వీడియోలు, వార్తలు ట్రేడింగ్ గా మారిపోయాయి. అయితే... ఈ పోరులో సమంతని వెనక్కి నెట్టేసింది లాస్య. ఇద్దరి వీడియోల్లో లాస్య వీడియోకే ఎక్కువ హిట్స్ వచ్చాయి. లాస్యకు సంబంధించిన ప్రతీ న్యూస్ లక్షల్లో చూశారు అభిమానులు. లాస్యతో పోలిస్తే సమంతకు అంత సీన్ ఏమీ లేదని తేలిపోయింది. సమంత, నాగచైతన్యల ఇద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారన్న సంగతి అందరికీ ఎప్పుడో తెలిసిపోయింది. అందుకే దాన్నెవ్వరూ ఎక్కువగా ఫోకస్ చేయలేదు.
కానీ లాస్య పై ఇటీవల బోలెడన్ని రూమర్లు. ఓ యాంకర్‌తో క్లోజ్‌గా ఉంటుందని, ఇద్దరికీ పెళ్లి కాబోతోందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తరవాత ఓ యువ హీరోతో లాస్యకు లింకులు పెట్టి మాట్లాడుకొన్నారు. ఈ నేపథ్యంలో లాస్య ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది? తనకు ఎవరితో ఎఫైర్ ఉంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అందుకే లాస్య నిశ్చితార్థం అనగానే క్లిక్కుల మీద క్లిక్కుల పడ్డాయి. సమంతని అంతా లైట్ తీసుకొన్నారు. అందుకే.. లాస్య ఎంగేజ్ మెంట్ ట్రేడింగ్‌లోకి వెళ్లిపోయింది. ఓ సినీ స్టార్‌కు ఉండాల్సిన పాపులారిటీ లాస్యకు వచ్చేసింది. బుల్లి తెర యాంకర్లా... మజాకా?