పోస్టర్ రివ్యూ: బాహుబలి -2
on Jan 26, 2017
తెలుగు సినిమా సత్తాను ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన సినిమా బాహుబలి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న బాహుబలి-2పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోగా..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ 28న ఈ బాహూబలి-2ని రిలీజ్ చేస్తామని నిర్మాతలు ముందే ప్రకటించారు..అంటే విడుదలకు గట్టిగా 3 నెలల సమయం మాత్రమే ఉంది. గతంలో బాహుబలి పార్ట్-1 విషయంలో ప్రమోషన్ ఓ రేంజ్లో చేసిన జక్కన్న పార్ట్-2 విషయంలో మాత్రం ఇంకా ఫుల్‌గా రంగంలోకి దిగలేదు. అయితే తాజాగా రిపబ్లిక్ డేని పురస్కరించుకుని రెండు పోస్టర్స్ రిలీజ్ చేశారు.
ఒకటి మాహిష్మతి ఏరియల్ వ్యూ..రెండవది ప్రభాస్ అనుష్కలు బాణాలతో ప్రాక్టీస్ చేస్తున్న పోస్టర్స్..బాహుబలి ది బిగినింగ్‌లో కేవలం జైలుకే పరిమితమైన అనుష్క పార్ట్-2లో మాత్రం అమరేంద్ర బాహుబలితో రోమాన్స్ చేయడంతో పాటు యుద్ధ విన్యాసాలు కూడా చేయనుందని ప్రచారం జరగ్గా..ఇప్పుడు తాజా పోస్టర్ చూస్తే నిజమే అనిపిస్తుంది. అలాగే సైజ్జీరోతో బాగా లావు పెరిగిపోయిన స్వీటీ తన మునుపటి ఫిగర్‌ని సాధించిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ స్పెషల్ పోస్టర్స్ రిపబ్లిక్ డే నాడు ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఖుషి చేసిందని చెప్పవచ్చు.