గౌతమిపుత్ర శాతకర్ణిపై హైకోర్టులో కేసు
on Jan 11, 2017
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హీరో బాలకృష్ణతో బంధుత్వం ఉండటం వల్లే నిబంధనలకు విరుద్ధంగా పన్ను మినహాయింపు ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా కోర్టు సెలవుల కారణంగా రెగ్యులర్ బెంచ్‌కు వెళ్లాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది.