బాలయ్యతో శాతకర్ణి చూడనున్న కేసీఆర్..!
on Jan 6, 2017
నటసింహం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను సినీ , రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ను హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ ఆయన ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా స్పెషల్ షోకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనికి స్పందించిన కేసీఆర్ తప్పకుండా వస్తానని మాట ఇచ్చారట. శాతకర్ణి ప్రారంభం రోజునే తాను సినీ రంగ ప్రముఖులతో కలిసి సినిమాను చూస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోబోతున్నారన్న మాట..?