రెడ్డిగారికి బాలయ్య హ్యాండిచ్చేసినట్టేనా?
on Dec 31, 2016
గౌతమి పుత్ర శాతకర్ఱి తరవాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఏమిటి? ఎవరితో ? అనే ఆసక్తి నెలకొంది. కృష్ణవంశీతో రైతు సినిమా చేయాల్సివున్నా.. అది పట్టాలెక్కే అవకాశం లేదని స్పష్టమైపోయింది. ఇటీవల ఎస్వీ కృష్ణారెడ్డి నందమూరి బాలకృష్ణని కలసి ఓ కథ వినిపించడం, అది బాలయ్యకు విపరీతంగా నచ్చేయడంతో బాలయ్య - కృష్ణారెడ్డి కాంబో ఓకే అయ్యిందని చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడ్నీ బాలయ్య పక్కన పెట్టేశాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణారెడ్డితో సినిమా చేయడం కరెక్ట్ కాదని, అగ్ర దర్శకులతోనో, ఫామ్లో ఉన్న వాళ్లతోనే ప్రోసీడ్ అవ్వడం మంచిదని బాలయ్యకు సన్నిహితులు సలహా ఇచ్చారట. దానికి తోడు కృష్ణారెడ్డి ఓ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. పైగా బాలయ్య కోసం చాలామంది స్టార్ దర్శకులు కథలు పట్టుకొని రెడీగా ఉన్నారు. గౌతమి పుత్రతో బాలయ్య రేంజ్ కూడా పెరిగింది. ఈ దశలో కృష్ణారెడ్డితో సినిమా చేయడం అంత కరెక్ట్ కాదని బాలయ్య కూడా భావిస్తున్నాడట. సో.. కృష్ణారెడ్డి కి హ్యాండివ్వడం తప్పదన్నమాట.